T20 World Cup 2024 Semi Final Schedule: టీ20 ప్రపంచకప్ 2024 సెమీస్‌లో ఆడే జట్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుకోగా.. తాజాగా సూపర్-8 గ్రూప్ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌కు చేరడం అఫ్గాన్‌కు ఇదే మొదటిసారి కావడం విశేషం. పొట్టి కప్‌లో గ్రూప్ దశ నుంచే సంచలన విజయాలు నమోదు చేస్తూ వస్తున్న అఫ్గాన్.. సూపర్-8లో కూడా పట్టు వదల్లేదు. లక్ష్యం చిన్నదైనా.. బంగ్లాదేశ్‌ను అద్భుత బౌలింగ్‌తో కట్టడి చేసి విజయం సాధించింది.
Also Read: AFG vs BAN: టీ20 ప్రపంచకప్ 2024లో సంచలనం..సెమీస్‌కు చేరిన అఫ్గాన్! ఆస్ట్రేలియా ఔట్
టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ గురువారం (జూన్ 27) ఉదయం 6 గంటలకు ఆరంభం అవుతుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇక రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో స్టార్ అవుతుంది. సెమీస్‌లలో గెలిచిన జట్లు జూన్ 29న ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.