IND vs CAN: నేడు కెనడాతో భారత్ ఢీ.. కళ్లన్నీ అతడిపైనే!
- భారత్ చివరి మ్యాచ్ నేడే
- కోహ్లీ జోరు అందుకునేనా
- రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం
- స్టార్ స్పోర్ట్స్
- హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Canada Preview and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు కెనడాను భారత్ ఢీకొట్టనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. భారీ విజయంతో ఘనంగా గ్రూప్ దశను ముగించి.. సూపర్-8కు మరింత జోష్‌తో వెళ్లాలని టీమిండియా చూస్తోంది. కీలకమైన సూపర్ 8కు ముందు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించాలి భారత్ భావిస్తోంది. మరోవైపు పటిష్ట రోహిత్ సేనకు కనీస పోటీని ఇవ్వాలని కెనడా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్.. హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఐర్లాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా.. పాకిస్థాన్, అమెరికాతో మ్యాచ్‌ల్లో శ్రమించాల్సి వచ్చింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆకట్టుకున్నారు. అయితే ఆందోళనంతా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పైనే. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్న విరాట్.. వరుసగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2024లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ.. ప్రపంచకప్‌లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 5 పరుగులే చేశాడు. కెనడాతో మ్యాచ్‌లో అయినా అతడు పుంజుకోవాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ప్రస్తుతం అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఒకవేళ కెనడా మ్యాచ్ కోసం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తే.. యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. అప్పుడు విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడనుండగా.. శివమ్ దూబేకు చోటు ఉండదు. ఇక బౌలింగ్‌లో భారత్ పటిష్ఠంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా పేస్‌తో హడలెత్తిస్తున్నారు. అయితే మొహమ్మద్ సిరాజ్ ప్రభావం చూపలేకపోతుండటం కాస్త కలవరపరిచే అంశం. ఈ మ్యాచ్‌తో అయినా గాడిలో పడితే.. టీమిండియాకు ఏ ఇబ్బంది ఉండదు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, ఆర్ జడేజా మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్‌లో ఒకరిని ఆడించే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్, జడేజా/కుల్దీప్, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్.
కెనడా: ఆరోన్, నవ్‌నీత్, పర్గత్, నికోలస్, శ్రేయస్, రవిందర్‌పాల్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), దిలాన్, ఖలీమ్ సాన, జునైద్, గోర్డాన్.
తాజావార్తలు
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!