NTV Telugu Site icon

T20 World Cup 2024 : సంచలనం.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం..

Afg

Afg

T20 World Cup 2024 : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా మరో సంచలనం నమోదయింది. నేడు సూపర్ 8 లో భాగంగా కింగ్స్టన్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులను చేసింది. ఇందులో కెప్టెన్ రహముల్లా 49 బంతులలో 60 పరుగులు సాధించగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం 48 బంతుల్లో 51 పరుగులు సాధించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఆ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లులో కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా రెండు వికెట్లు పడగొట్టారు.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి మూవీ టికెట్స్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్..

ఇక తక్కువ పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆస్ట్రేలియా కేవలం 19.2 ఓవర్లకి 127 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా జట్టులో మాక్స్వెల్ 41 బంతుల్లో 59 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్సు లలో గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని చవి చూసాడు. ఇక ఈయనకు తోడుగా నవీన్ హక్ 3 వికెట్లు, ఒమ్రేజై, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ చరో వికెట్ సాధించారు. ఇక సోమవారం నాడు టీమిండియాతో జరగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోతే దాదాపు ఇంటికి వెళ్లే పరిస్థితి ఉంటుంది.

Tirumala Darshan : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం..