NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు.. టీ20 ప్రపంచకప్‌లో రాణిస్తాడు!

Hardik Pandya

Hardik Pandya

Sunil Gavaskar on Hardik Pandya Form: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు అని, టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తాడని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ కంటే టీమిండియాకు ఆడేటప్పుడు భిన్నమైన ఆలోచనలో ఉంటాడన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో హార్దిక్ రాణించలేదు. బ్యాట్, బాల్ మాత్రమే కాకుండా నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆడిన 10 మ్యాచ్‌లలో 197 పరుగులు చేసిన హార్దిక్.. కేవలం ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి సారథ్యంలో ముంబై పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.

మంగళవారం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. అంతేకాదు అతడు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో విఫలమయిన హార్దిక్‌ను ప్రపంచకప్‌కు ఏందుకు ఎంపిక చేశారని నెటిజన్స్ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ స్పందించారు. స్పోర్ట్స్ టుడేలో సన్నీ మాట్లాడుతూ… ‘ఐపీఎల్‌లో ఆడటానికి, దేశం కోసం ఆడటానికి చాలా తేడా ఉంటుంది. దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి ఆటగాడిలో ఓ విభిన్నత ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భిన్న హార్దిక్ పాండ్యాను చూస్తారు’ అని అన్నారు.

Also Read: T20 World Cup 2024: రాహుల్ ద్రవిడ్ రాజకీయం.. రుతురాజ్ గైక్వాడ్‌కు అన్యాయం!

‘ఐపీఎల్‌ 2024లో హార్దిక్ పాండ్యా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటిని అతడు చక్కగా ఎదుర్కొన్నాడు. విదేశాలకు వెళ్లి భారతదేశం కోసం ఆడవలసి వచ్చినప్పుడు అతను పూర్తిగా భిన్నమైన ఆలోచనలో ఉంటాడు. ఐపీఎల్ కంటే ప్రపంచకప్‌లో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెగా టోర్నీలో హార్దిక్ బ్యాట్, బంతితో రాణిస్తాడు. ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడుతాడు’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

Show comments