INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా సరికొత్త రికార్డుతో చెలరేగింది. దాయాది దేశమైన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత అర్ధసెంచరీతో మెరిసిన మంధనా, భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన దిగ్గజాల సరసన చేరింది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టుకు మంధనా వెన్నుముకగా నిలిచింది. ఇన్నింగ్స్ 11.2 ఓవర్ వద్ద పాక్ బౌలర్ రామీన్ షమీమ్ వేసిన ఫ్లైటెడ్ డెలివరీని క్రీజ్ వెలుపలికి వచ్చి, ఎక్స్ట్రా కవర్ మీదుగా అద్భుతమైన ఇన్-సైడ్ అవుట్ షాట్‌తో బౌండరీగా మలచి ఆమె తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. మధ్యలో ఒకసారి లైఫ్ లభించినప్పటికీజజ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ చివరి కొన్ని ఓవర్లలో ఆమె బ్యాట్ వేగాన్ని పెంచింది. అయితే మొత్తం మీద 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 154.55 స్ట్రైక్ రేట్‌తో 68 పరుగులు చేసి షమీమ్ బౌలింగ్ లోనే అవుటయి వెనుదిరిగింది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
స్మృతి మంధనా మెరుపు ఇన్నింగ్స్‌తో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక యాభై అంతకంటే ఎక్కువ స్కోర్లు (50+ స్కోర్లు) చేసిన టాప్ బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధనా అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు కేవలం మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట మాత్రమే ఉండేది.
Smriti Mandhana gets her Women’s T20 World Cup campaign off to a fine start with a classy fifty 🙌
The left-hander brought up her half-century in just 34 balls.
Most 50+ scores for India in Women’s T20 World Cups:
5️⃣ Harmanpreet Kaur
5️⃣ Mithali Raj
5️⃣ Smriti Mandhana*📸:… pic.twitter.com/PV9fj9DSZK
— Sportstar (@sportstarweb) June 14, 2026
టీ20 ప్రపంచకప్‌లలో భారత్ తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు..
స్మృతి మంధనా: 5 (26 ఇన్నింగ్స్‌లు), మిథాలీ రాజ్: 5 (23 ఇన్నింగ్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్: 5 (34 ఇన్నింగ్స్‌లు), పూనమ్ రౌత్: 3 (15 ఇన్నింగ్స్‌లు). కేవలం 26 ఇన్నింగ్స్‌ల్లోనే మంధనా ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (6), జెమిమా రోడ్రిగ్స్ (1) త్వరగా అవుటైనప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తో కలిసి మంధనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!