Saurabh Netravalkar: అతడి వికెట్ తీయడం ఓ ఎమోషనల్ మూమెంట్: అమెరికా పేసర్
- ఉన్నత చదువుల కోసం అమెరికాకు
- ఒరాకిల్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం
- కోహ్లీ వికెట్ స్పెషల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saurabh Netravalkar Said Virat Kohli wicket is very special for me: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ఓ ఎమోషనల్ మూమెంట్ అని అమెరికా లెఫ్టార్మ్ సీమర్ సౌరభ్ నేత్రావల్కర్ వెల్లడించాడు. విరాట్‌తో తనకు అంతగా పరిచయం లేదని.. వికెట్ తీసిన అనంతరం అభినందించాడని తెలిపాడు. 32 ఏళ్ల నేత్రావల్కర్ 2010లో భారత్ తరఫున అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి.. ఒరాకిల్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తనకిష్టమైన క్రికెట్ ఆడాడు. ఆనతి కాలంలోనే అమెరికా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024లో ఆడుతున్నాడు.
గ్రూప్-ఏలో భాగంగా కెనడా, పాకిస్తాన్‌లపై అమెరికా విజయం సాధించడంలో సౌరభ్ నేత్రావల్కర్ కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని గోల్డెన్ డకౌట్‌గా అవుట్ చేసిన నేత్రావల్కర్.. రోహిత్ శర్మ వికెట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ అనంతరం నేత్రావల్కర్ మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘నేను రెండు రంగాల్లో కెరీర్ కొనసాగిస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా త్వరత్వరగా జరిగిపోయింది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా’ అని నేత్రావల్కర్ తెలిపాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Sehwag-Shakib: సెహ్వాగ్ ఎవరో నాకు తెలియదు.. షకీబ్ అల్ హసన్ కౌంటర్!
‘నాకు పాకిస్తాన్, భారత్ మ్యాచ్‌లు అత్యంత కీలకమైనవి. విరాట్ కోహ్లీ వికెట్ తీయడం ఓ ఎమోషనల్ మూమెంట్. ఆఫ్ స్టంప్ ఎగురగొట్టాలని చూశా. నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి విరాట్ వికెట్ తీశా. విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదు. కానీ వికెట్ తీసిన తర్వాత నన్ను అభినందించాడు’ అని సౌరభ్ నేత్రావల్కర్ చెప్పాడు. భారత్, అమెరికా మ్యాచ్ అనంతరం నేత్రావల్కర్ ఇంటర్వ్యూ కోసం విలేకరులు ఆసక్తి చూపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్‌ను వదిలి పది మందికి పైగా రిపోర్టర్లు నేత్రవాల్కర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించారు.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!