Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమ్ ఇండియా వరుస విజయాలు సాధించింది. ఇక రెండో రౌండ్ సూపర్ 8 గేమ్ లకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కేవలం ఐదు రోజుల్లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఈ విషయంలో రోహిత్ (Rohit Sharma) ఐసీసీని పరోక్షంగా విమర్శించకున్న., దీన్ని సాకుగా చూపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.
Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!
గ్రూప్ దశ నుంచి సూపర్ 8కి చేరుకున్నాం. ఈ దశలో మనం విభిన్నంగా ఆడాలి. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాలి. ప్రతి ఆటగాడు తమ అత్యుత్తమ వైపు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము శిక్షణలో దీనిపై చాలా తీవ్రంగా పని చేసాము. మేము ప్రతి ప్రాక్టీస్ సెషన్ లో ఓ కొత్త నైపుణ్యం సాధించడంపై దృష్టి సాదిస్తున్నామని రోహిత్ చెప్పాడు.
Parthasarathy: అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదే:మంత్రి పార్థసారథి
సూపర్ 8లో ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత తక్కువ సమయంలోనే భారీ మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో టీమిండియా షెడ్యూల్ కాస్త హడావిడిగా ఉంది. మేము ఈ విధంగా చాలా సార్లు ఆడాము. అయితే, ఆటల కోసం మేము చాలా ప్రయాణించవలసి ఉంటుంది. దీనికి గల కారణాలను నేను వివరించదలచుకోలేదు. వెస్టిండీస్ లో ఆడిన అనుభవం ఆటగాళ్లకు ఉంది. మేము ఇక్కడ చాలా గేమ్ లు గెలిచాము కూడా. ఎక్కడ ఆడినా 100% కష్టపడి గెలుస్తాం. గ్రూప్ దశలో ఆడినట్లే సూపర్ 8లో మొత్తం జట్టుగా ఆడతాం. సూపర్ 8లో సత్తా చాటాలని ప్రతి ఆటగాడు ఎదురు చూస్తున్నాడని రోహిత్ శర్మ అన్నాడు. ఇక సూపర్ 8 లో జూన్ 20న అఫ్గానిస్థాన్, జూన్ 22న బంగ్లాదేశ్, జూన్ 24న ఆస్ట్రేలియా లతో తలపడనుంది.