Rohit Sharma Frustrated on Rishabh Pant: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 దశలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే కష్టపడింది. చివరకు బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఓడిపోక తప్పలేదు. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురైయ్యాడు. పంత్‌పై రోహిత్ సీరియస్ అయ్యాడు.
ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ విజయం ఖరారైంది. 20వ ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్ స్టార్క్.. కమిన్స్‌కు స్ట్రైకింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బై రూపంలో సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న కీపర్ రిషబ్ పంత్.. వికెట్లకు వేగంగా త్రో విసిరాడు. బంతి కాస్త బౌలింగ్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ చేతికి బలంగా తాకింది. దాంతో హార్దిక్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఏంటి ఇలా విసిరావ్ అన్నట్లు ఓ చూపు చూసాడు. ఆ సమయంలో భారత్‌కు వికెట్‌తో పనేలేదు కానీ పంత్ అత్యుత్సాహం చూపించాడు. ఇది చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ పంత్‌పై సీరియస్ అయ్యాడు. బంతిని అలా ఎందుకు విసిరావ్? అని సైగలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: IND vs ENG Semi Final: భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు ‘నో రిజర్వ్ డే’.. కారణం ఏంటంటే?
ఐపీఎల్ 2024లో విఫలమైన హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం చెలరేగుతున్నాడు. బ్యాట్, బంతితోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడు భారత్‌కు ప్రధాన బలంగా మారాడు. కీలక సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును టీమిండియా ఢీకొన్సాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో హార్దిక్‌కు గాయమై జట్టుకు దూరమైతే.. అది టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. అందుకే రిషబ్ పంత్‌పై రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు.
— Nihari Korma (@NihariVsKorma) June 25, 2024