NTV Telugu Site icon

AUS vs BAN: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ప్యాట్ కమిన్స్!

Pat Cummins Hat Trick

Pat Cummins Hat Trick

Pat Cummins Takes Hat-Trick in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ తరఫున హ్యాట్రిక్‌ తీసిన రెండో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్-8 పోరులో శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ పడగొట్టడడంతో కమిన్స్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 2007లో బంగ్లాదేశ్‌పైనే మాజీ పేసర్ బ్రెట్‌ లీ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. గ్రూప్ దశలో తేలిపోయిన కమిన్స్.. కీలక సూపర్-8లో ఫామ్ అందుకోవడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.

బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను వరుస బంతుల్లో ప్యాట్ కమిన్స్ ఔట్ చేశాడు. 18వ ఓవర్ చివరి రెండు బంతులకు మహ్మదుల్లా, మహెదిలను ఔట్ చేసిన కమిన్స్.. 20వ ఓవర్ తొలి బంతికి హృదయ్‌ను పెవిలియన్ చేర్చాడు. మహ్మదుల్లా బౌల్డ్ కాగా.. మహెది, హృదయ్‌లు క్యాచ్ ఔట్ అయ్యారు. కమిన్స్ హ్యాట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్‌ ఇదే కావడం విశేషం.

Also Read: Lenovo Yoga Pro 7i Price: ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్‌.. సూపర్ లుకింగ్, బెస్ట్ పెర్మామెన్స్!

టీ20 ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా ప్యాట్ కమిన్స్ ఏడో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌ లీ (2007), ఐర్లాండ్‌ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ (2021), శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ (2021), దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (2021), యూఏఈ బౌలర్ కార్తిక్ మైయప్పన్ (2022), ఐర్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్ జోష్ లిటిల్ (2022) ఈ ఘనత సాధించారు. 2024లో ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్‌ పడగొట్టాడు.

Show comments