Pakistan Fans Clash: పాకిస్తాన్ ఘోర ఓటమి.. స్టేడియంలో ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌తో గొడవ
- పాకిస్తాన్ టీమ్, అభిమానులకు ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ..
- మైదానంలో పొట్టు పొట్టు కొట్టుకున్న పాక్- ఇంగ్లాండ్ ఫ్యాన్స్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో..
Pakistan Fans Clash: ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ అనే మాట పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు, వారి ఫ్యాన్స్ కి కరెక్టుగా సరిపోతుందని మరోసారి తేలిపోయింది. చిన్న చిన్న జట్లపై భారీ విజయాలు సాధిస్తూ, తమను తాము టాప్ జట్టుగా చెప్పుకునే పాకిస్తాన్, జింబాబ్వే, నేపాల్ లాంటి అసోసియేట్ జట్లపై చెలరేగే బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ ను ‘కింగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ప్రయాణం ఆశించినంత సాఫీగా కొనసాగడం లేదు. భారత్ చేతుల్లో ఓడిన తర్వాత అసోసియేట్ దేశాలపై గెలిచి సూపర్–8కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో లక్కీగా ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది.
Read Also: Adulterated Milk: కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి, 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమం
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్‌ను లీక్ చేసిన సూర్య..
అయితే, ఇంగ్లాండ్ తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో చివరి మ్యాచ్‌లో గెలిచినా సెమీఫైనల్ చేరాలనే పాకిస్తాన్‌కు బాగా లక్ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే ఆతిథ్య శ్రీలంక క్రికెట్ జట్టుపై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, న్యూజిలాండ్ కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ఆశిస్తుంది.
Read Also: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
కాగా, పల్లెకెలేలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పై ఇంగ్లాడ్ రెండు వికట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో హ్యారీ బ్రూక్ సేన సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ఓటమిపై ఓ ఇంగ్లాండ్ అభిమాని చేసిన కామెంట్‌కు ఆగ్రహించిన దాయాది దేశ ఫ్యాన్స్ అతడితో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త కొట్టుకునే స్థాయికి చేరడంతో.. ఇతర క్రికెట్ ఫ్యాన్స్ జోక్యం చేసుకుని గొడవను ఆపారు. ఈ మొత్తం ఘటనను ఓ శ్రీలంక క్రికెట్ అభిమాని బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ మొబైల్లో రికార్డు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక, ఈరోజు ( ఫిబ్రవరి 25న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్- శ్రీలంక మ్యాచ్ జరగనుంది. అయితే, గ్రూప్–2 నుంచి సెమీఫైనల్‌కు చేరే రెండో జట్టును డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
Play silly games, win silly prizes.
Serial offender. Time for the @ICC to take a stand. #cricket #worldcup pic.twitter.com/pdbrAG13tY
— Jake Jeakings (@JakeJeakings1) February 24, 2026
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో