NTV Telugu Site icon

Monank Patel: మా విజయానికి కారణం అదే: అమెరికా కెప్టెన్

Monank Patel Interview

Monank Patel Interview

Monank Patel on United States Win vs Pakistan: పాకిస్తాన్‌పై మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ బాగా చేయడమే తమ విజయానికి కారణం అని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. ఛేదనలో మంచి భాగస్వామ్యం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతిసారి రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అని మోనాంక్ పటేల్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా డల్లాస్‌ వేదికగా గురువారం రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో యూఎస్ గెలిచింది.

పోస్ట్‌ మ్యాచ్ ప్రేజంటేష‌న్‌లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ… ‘టాస్ గెలిచి మొదటి 6 ఓవర్లలో బాగా బౌలింగ్ చేయడం మాకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వికెట్లు తీసి పాకిస్తాన్‌ను ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నాం. బాబర్, షాబాద్ భాగస్వామ్యం అనంతరం పాక్ భారీ స్కోర్ చేస్తుందని తెలుసు. కానీ మా బౌలర్లు అద్భుతం చేశారు. 160 పరుగుల లక్ష్యం కాబట్టి మేం ఛేదిస్తామని అనుకున్నాం. అందుకు మంచి భాగస్వామ్యం అవసరం అని తెలుసు. మేం అదే చేశాం. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతి సంవత్సరం రాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని తెలిపాడు.

Also Read: PAK vs USA: అమెరికా మా కంటే మెరుగ్గా ఆడింది: బాబర్‌ ఆజామ్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్ (44; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. షాదాబ్‌ ఖాన్‌ (40; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆండ్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. సూపర్‌ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేయగా.. పాక్‌ ఒక వికెట్ నష్టానికి 13 రన్స్‌ చేసి ఓడింది.

 

Show comments