NTV Telugu Site icon

Babar Azam Record: చ‌రిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్!

Babar Azam Record

Babar Azam Record

Babar Azam overtakes Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాటర్‌గా బాబ‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా డల్లాస్‌ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 4067 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 117 టీ20 మ్యాచ్‌ల్లో 4037 రన్స్ చేశాడు. అమెరికాతో మ్యాచ్‌కు రెండో స్థానంలో ఉన్న బాబ‌ర్ ఆజమ్.. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీని దాటాడు. ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 152 మ్యాచ్‌ల్లో 4027 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి మధ్య పరుగుల తేడా పెద్దగా లేకపోవడంతో.. టీ20 ప్రపంచకప్‌ 2024లో బాబర్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Monank Patel: మా విజయానికి కారణం అదే: అమెరికా కెప్టెన్

అమెరికాతో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు స‌మంగా పోరాడ‌న‌ప్ప‌టికి.. సూప‌ర్ ఓవ‌ర్‌లో పాక్‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. అమెరికా నిర్ణీత 20 ఓవ‌ర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన‌ యూఎస్ 18 పరుగులు చేయగా.. పాక్ 13 మాత్రమే చేసి ఓటమిపాలైంది.