NTV Telugu Site icon

Mohammad Rizwan: ఘోరపరాజయాల తర్వాత, పాక్ క్రికెట్‌లో రాజకీయాలపై పెదవి విప్పిన రిజ్వాన్..

Pajistan

Pajistan

Mohammad Rizwan: టీ 20 వరల్డ్ కప్‌లో ఘోర ప్రదర్శనపై పాకిస్తాన్ క్రికెట్ టీం సొంతదేశ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీలు ఒకడుగు ముందుకేసి మొత్తం టీంలోని ఆటగాళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టోర్నీలో పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడమే కాకుండా చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు టీ20 వరల్డ్ కప్‌ని భారత్ గెలవడం ఆ దేశ ప్రజల ఆగ్రహంపై మరింత కారం చల్లినట్లైంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులో గ్రూపులు పెరిగాయని, ఒక జట్టుగా ఆటగాళ్లు ఆడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూపు దశలోనే నిష్క్రమించడంపై పాక్ జట్టు విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే, జట్టు పరాజయం, జట్టులో రాజకీయాలపై వస్తున్న విమర్శలపై ఆ దేశ కీపర్ కమ్ ఓపెనర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ‘‘జట్టులో కొన్ని రాజకీయాలు ఉన్నాయని, కొన్ని విభేదాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఏవైనా విభేదాలు ఉంటే, మేము ముందు ఆటలు కూడా కోల్పోయాము. ఈ ఆరోపణలు అన్ని వట్టివే. ఇదే జట్టు ఫైనల్స్, సెమీ ఫైనల్స్ ఆడింది, కానీ మేం ట్రోఫీని గెలవలేదన్నది నిజం’’ అని పెషావర్‌లో విలేకరుల సమావేశంలో రిజ్వాన్ అన్నారు.

Read Also: Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!

తమ ఆటతీరు కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నామని ఆయన సమర్థించుకున్నారు. తాము అంచనాలను అందుకోలేదని, కాబట్టి విమర్శలకు అర్హులమని చెప్పారు. విమర్శలను ఎదుర్కోలేని ఆటగాళ్లు విజయం సాధించలేరని చెప్పారు. టీ20 ప్రపంచకప్ ప్రదర్శనతో తాము నిరాశ చెందామని చెప్పారు. తమ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు.

అయితే నివేదికల ప్రకారం, కెప్టెన్‌గా తిరిగి వచ్చిన బాబర్ అజామ్ జట్టును ఏకతాటిపైకి తీసుకురాలేదని తెలుస్తోంది. కెప్టెన్సీ కోల్పోవడంతో షాహీన్ షా అఫ్రిదీ అసంతృప్తితో ఉన్నాడని, అవసరమైనప్పుడు బాబర్ అతడికి సపోర్ట్ ఇవ్వలేదని, మరోవైపు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీకి పరిగణించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.