టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు గురువారం స్వదేశానికి తిరిగి వచ్చింది. బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న భారత బృందం ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. అనంతరం విజేత జట్టు ముంబైలో జరిగిన విజయోత్సవ పరేడ్‌లో పాల్గొంది. మెరైన్ డ్రైవ్‌లో రోహిత్ శర్మ అండ్ కంపెనీకి లక్షలాది మంది అభిమానులు చారిత్రాత్మక స్వాగతం పలికారు. అనంతరం మహారాష్ట్ర విధాన్ భవన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మను సన్మానించారు. రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సన్మానించారు. కాగా, టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.11 కోట్ల రివార్డును ప్రకటించారు.
READ MORE: Tesla: భారత్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపని టెస్లా..ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర విధాన్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ శర్మ మరాఠీలో మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం.. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు సీఎం సార్.. అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది.. 2013లో చాంపియన్స్ ట్రోఫీని గెలవాలని చాలా ఏళ్లుగా ఎదురుచూశాం. ఇది కేవలం సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వల్లనో, నా వల్లనో జరగలేదు. జట్టు మొత్తం విజయానికి సహకరించింది. ఇలాంటి జట్టు లభించడం నా అదృష్టం. వాళ్లంతా పటిష్టమైన ఆటగాళ్లు” అని రోహిత్ శర్మ అన్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన చేతికి చిక్కినట్లు చెప్పారు. స్యూర్య కుమార్ పై జోక్స్ వేస్తూ.. అందరినీ నవ్వించారు.