Site icon NTV Telugu

Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!

Ishan Kishan (1)

Ishan Kishan (1)

Ishan Kishan: టి20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్ తో అభిమానులను అలరించాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన హిట్టింగ్ పవర్ ను మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్ లో మొత్తం 24 బంతుల్లో 61 పరుగులు చేసిన ఇషాన్, 254.17 స్ట్రైక్‌రేట్ తో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.

India vs Namibia: రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే?

ఈ అర్ధ సెంచరీతో ఇషాన్ కిషన్ ఒక ప్రత్యేక రికార్డును తన పేరుపై రాసుకున్నాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. ఇదివరకు మహేంద్ర సింగ్ ధోని, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వంటి వికెట్‌కీపర్లు ఈ టోర్నీలో ఆడినా.. వారు ఎవరు ఈ మైలురాయిని చేరుకోలేకపోయారు. అంతేకాదు.. ఇషాన్ దూకుడు బ్యాటింగ్‌తో భారత్ మరో ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. కేవలం 6.5 ఓవర్లలో (41 బంతుల్లో) 100 పరుగులు చేరుకుని, టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది.

ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా భారత్ మొదటి ఆరు ఓవర్లలో 86 పరుగులు చేసి టి20 ప్రపంచకప్‌లో తమ అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. పవర్‌ప్లే లోనే అర్ధ సెంచరీ సాధించిన మూడవ భారతీయుడిగా ఇషాన్ నిలిచాడు.ఇంతకుముందు కేఎల్ రాహుల్ (2021లో స్కాట్లాండ్‌పై 19 బంతుల్లో), రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో) ఈ ఘనత సాధించారు. ఈసారి ఇషాన్ మరింత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

Naresh Comments on Saree: చీర వస్త్రధారణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్! నటుడు సురేష్ ఏమన్నారంటే?

ఇషాన్ కిషన్ తన టి20 ప్రపంచకప్ లో అరంగేట్రాన్ని 2021లో న్యూజిలాండ్‌పై చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత ఈ టోర్నీలో మళ్లీ USAపై 20 పరుగులు చేసిన తర్వాత ఇప్పుడు నమీబియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన పవర్ ఏంటో చూపించాడు.

Exit mobile version