NTV Telugu Site icon

Indian Cricket Team: భారత్ చేరుకున్న టీమిండియా.. అభిమానులకు ట్రోఫీ చూపెట్టిన రోహిత్ శర్మ!

Team India Arrives Delhi

Team India Arrives Delhi

Rohit Sharma showing T20 World Cup 2024 Trophy to Indian Fans: టీ20 ప్రపంచకప్‌ 2024 సాధించి విశ్వవేదికపై భారత పతాకాన్ని ఎగురవేసిన టీమిండియా.. సగర్వంగా భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు దేశ రాజధాని ఢిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని అభిమానులకు చూపించాడు.

Also Read: Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్‌ కల్యాణ్‌.. ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు!

ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భారత జట్టు సమావేశం అవుతుంది. ప్రధానితో సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలోనే జట్టు ముంబైకి బయల్దేరుతుంది. ముంబైలో సాయంత్రం 5 గంటలకు రోడ్‌ షో మొదలవుతుంది. రెండు గంటల పాటు సాగే ఊరేగింపులో ఓపెన్‌ టాప్‌ బస్సులో భారత ప్లేయర్స్ టీ20 ట్రోఫీతో అభిమానులకు అభివాదం చేయనున్నారు. ఇక రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు భారీ ఎత్తున సన్మానం జరగనుంది.

Show comments