IND vs WI: భారత్ vs వెస్టిండీస్ హెడ్ టు హెడ్ రికార్డులు..

Ind Vs Wi

Ind Vs Wi

IND vs WI: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడిగయంలో ఆదివారం ( మార్చ్ 1న) భారత్ వర్సెస్ వెస్టిండీస్‌ మ్యాచ్ తలపడనుంది. సెమీఫైనల్ కు వెళ్లాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. వెస్టిండీస్‌కు కూడా ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. ప్రత్యర్థి వెస్టిండీస్‌కు మాత్రం గ్రూప్‌ దశలో స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండగా.. ఈ ఫార్మాట్లో టీమిడియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను ఒకసారి చూద్దాం..

Read Also: Be Alert: కుబేరా సీన్ రిపీట్.. బిచ్చగాళ్ల పేర్లతో అకౌంట్స్.. ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ తో వెలుగులోకి

హెడ్ టు హెడ్ రికార్డులు:
* భారత్, వెస్టిండీస్ 30 టీ 20 మ్యాచుల్లో తలపడ్డాయి..
* టీమిండియా 19 మ్యాచుల్లో విజయం..
* వెస్టిండీస్‌ టీమ్ 10 మ్యాచుల్లో గెలుపు..
* ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు..
* టీమిండియా స్వదేశంలో 8, వెస్టిండీస్‌ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 మ్యాచ్‌ల్లో విజయం..
* విండీస్ జట్టు స్వదేశంలో 5, భారత గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచుల్లో గెలుపు..

Read Also: Drugs seized: పుష్ప రేంజ్‌లో స్కెచ్‌లు.. ఆటకట్టించిన పోలీసులు

వరల్డ్‌ కప్‌ లో పోటీ:
* ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్, వెస్టిండీస్ మధ్య 4 సార్లు పోటీ
* వీటిలో భారత్‌ ఒక మ్యాచ్‌ గెలిస్తే.. వెస్టిండీస్‌ మూడింట్లో విజయం..
*విండీస్ జట్టుపై టీమిండియా అత్యధిక స్కోర్‌ 192, అత్యల్ప స్కోర్ 130..
* భారత జట్టుపై కరేబియన్‌ అత్యధిక స్కోర్‌ 196, అత్యల్ప స్కోర్‌ 129..
* టీ20ల్లో భారత్ దే వెస్టిండీస్ జట్టుపై పైచేయి.. అయినా వరల్డ్ కప్‌లో మాత్రం విండీస్ దే అప్పర్ హ్యాండ్..

అయితే, జింబాబ్వేపై విజయం సాధించడంతో భారత జట్టు జోష్‌ మీద కనిపిస్తుంటే.. ఇదే ఊపులో వెస్టిండీస్‌ను సైతం మట్టి కరిపించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.