ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పాకిస్తాన్, టీమిండియా జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాడు దాయాదులు ఢీకొట్టబోతున్నారు. ఇకపోతే ఈ మెగా ఈవెంట్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ పై ఎనిమిది వికెట్ల భారీ తేడాతో గెలిచి శుభారంభం చేసింది. ఇక మరోవైపు పాకిస్తాన్ అనుకొని విధంగా అమెరికా చేతిలో ఓడిపోయింది.
Maldivian President Muizzu: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లడం గౌరవంగా భావిస్తున్నాను..
ఇకపోతే ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు ఎనిమిది టి20 ప్రపంచ కప్ లలో భాగంగా మొత్తం 7 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. 2007లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ డ్రా అవ్వగా అందులో బాల్ అవుట్ లో టీమిండియా విజయం సాధించింది. ఇక ఎప్పుడెప్పుడు ఆడారు.. దాని రెసుల్త్ చూస్తే..
Pawan kalyan : రామోజీని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు..
2007 ప్రపంచకప్: మొదటి టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ లు రెండుసార్లు తలపడింది. మొదటి మ్యాచ్ టై అవ్వగా.. బౌల్ అవుట్ ద్వారా భారత్ మ్యాచ్ ను గెలిచింది. ఆ తర్వాత ఫైనల్స్ లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టీ20 ఛాంపియన్ గా నిలిచింది.
2012 ప్రపంచకప్: 2012లో సూపర్ 8 స్టేజ్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2014 ప్రపంచకప్: 2014 లో సూపర్ 8లో మరోసారి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విక్టరీ అందుకుంది.
2016 ప్రపంచకప్: 2016 లో గ్రూప్ స్టేజ్ లో ఈడెన్ గార్డెన్స్ లో ఇరుజట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2021 ప్రపంచకప్: 2021లో మొదటిసారి పాకిస్థాన్ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది.
2022 ప్రపంచకప్: 2022 లో ఇరుజట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో.. చివరి బాల్‌కి సిక్స్ కొట్టి ఇండియాకి ఘన విజయం అందించాడు.