USA vs IND: నేడు అమెరికాతో మ్యాచ్.. హ్యాట్రిక్‌పై భారత్ గురి!
- అమెరికాతో పోరు
- భారత్‌కు ఎదురుందా?
- తుది జట్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs USA Prediction and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. భారత్ మాదిరే అమెరికా కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్ మీదుంది. పాకిస్థాన్‌కు యూఎస్ఏ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.విజయాలు సాధించినా బ్యాటింగ్‌లో భారత్ మెరుగుపడాల్సి ఉంది. పాక్ మ్యాచ్‌లో పరుగుల కోసం చెమటోడ్చిన టీమిండియా.. 27 పరుగులకే చివరి 7 వికెట్లు చేజార్చుకుంది. ఆ తడబాటును అధిగమిస్తూ ఈ మ్యాచ్‌లో చెలరేగాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. రిషబ్ పంత్ ఆట జట్టుకు సంతోషాన్నిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దళంతో పాటు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం అమెరికా బ్యాటర్లకు పెద్ద సవాలే.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
పసికూనగా టోర్నీలో అడుగుపెట్టిన అమెరికా వరుసగా రెండు విజయాలతో సూపర్-8 రేసులో నిలిచింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు షాకిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. కెనడాతో మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను సూపర్ ఓవర్ దాకా లాక్కొచ్చి గెలిచింది. ఆరోన్ జోన్స్ ఫామ్‌లో ఉండడం అమెరికాకు సానుకూలాంశం. కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్‌లు బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. అందుకే అమెరికాను భారత్ తేలికగా తీసుకుంటే పొరపాటే అవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
న్యూయార్క్ పిచ్‌లో ఏ మార్పు లేదు. మరోసారి తక్కువ స్కోరే నమోదు కానుంది. ఇక్కడ చిన్న లక్ష్యాలను ఛేదించడం కూడా కఠిన సవాలుగా మారుతోంది. అయితే గత మ్యాచ్‌ల్లోలా బంతి అనూహ్యంగా బౌన్స్ కాదని భావిస్తున్నారు. చేజింగ్ కష్టం కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోనుంది. ఈ మ్యాచ్‌కు వర్షంతో పూర్తిగా ముప్పయితే లేకపోయినా అంతరాయం తప్పదు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
అమెరికా: స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్, ఆంద్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్‌దీప్ సింగ్, కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!