IND vs USA: భయం మా బ్లెడ్‌లోనే లేదు.. టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: అమెరికా ప్లేయర్
- ఎలాంటి భయం లేకుండా ఆడుతాం
- అమెరికా ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
- గెలిచిన జట్టు సూపర్ 8కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA Player Aaron Jones Says Fear is not in our Blood: భారత్‌పై ఎలాంటి భయం లేకుండా ఆడేస్తామని, ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ అన్నాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని పేర్కొన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని జోన్స్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నేడు అమెరికాతో భారత్ తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ 8కి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తమ జట్టుకు భయం లేదని, అందుకే విజయాలు సాధిస్తున్నామని జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆరోన్ జోన్స్ మాట్లాడుతూ… ‘టీమిండియాకు మేం గట్టి పోటీనిస్తాం. భయం లేకుండా ఆడేస్తాం. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే మేం విజయాలు సాదిస్తున్నాం. ఇందుకోసం కోసం తీవ్రంగా శ్రమించాం. భారత జట్టులో ఏ ఆటగాడి నుంచి కఠిన సవాల్ ఎదురవుతుందంటే సమాధానం చెప్పడం కష్టమే. ప్రతి ఆటగాడు ఓ ఛాంపియన్. బౌలింగ్‌లో మాత్రం జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠిన సవాలే. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేం’ అని అన్నాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Modi-Pawan Kalyan: మోడీతో మెగా బ్రదర్స్.. చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం!
ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా.. టీమిండియాపై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్ 8కు అర్హత సాధించనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఇంటికి వెళ్లక తప్పదు.
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!