NTV Telugu Site icon

IND vs USA: భయం మా బ్లెడ్‌లోనే లేదు.. టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: అమెరికా ప్లేయర్

Aaron Jones

Aaron Jones

USA Player Aaron Jones Says Fear is not in our Blood: భారత్‌పై ఎలాంటి భయం లేకుండా ఆడేస్తామని, ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ అన్నాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని పేర్కొన్నాడు. పిచ్‌ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని జోన్స్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా నేడు అమెరికాతో భారత్ తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్‌ 8కి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తమ జట్టుకు భయం లేదని, అందుకే విజయాలు సాధిస్తున్నామని జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆరోన్ జోన్స్ మాట్లాడుతూ… ‘టీమిండియాకు మేం గట్టి పోటీనిస్తాం. భయం లేకుండా ఆడేస్తాం. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే మేం విజయాలు సాదిస్తున్నాం. ఇందుకోసం కోసం తీవ్రంగా శ్రమించాం. భారత జట్టులో ఏ ఆటగాడి నుంచి కఠిన సవాల్‌ ఎదురవుతుందంటే సమాధానం చెప్పడం కష్టమే. ప్రతి ఆటగాడు ఓ ఛాంపియన్. బౌలింగ్‌లో మాత్రం జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠిన సవాలే. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. పిచ్‌ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేం’ అని అన్నాడు.

Also Read: Modi-Pawan Kalyan: మోడీతో మెగా బ్రదర్స్‌.. చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం!

ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా.. టీమిండియాపై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్ 8కు అర్హత సాధించనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఇంటికి వెళ్లక తప్పదు.