Jasprit Bumrah on Trolls When He Wad Injured: ఒక్క సంవత్సరం వ్యవధిలోనే తన పట్ల కొందరికి అభిప్రాయం మారిపోయిందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తన కెరీర్ ముగిసిందన్న వారే.. ఇప్పుడు బుమ్రా సూపర్ అని అంటున్నారన్నాడు. ఎప్పుడైనా తన ముందున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా అని బుమ్రా చెప్పుకొచ్చాడు. 2022లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. సొంతగడ్డపై పునరాగమనానికి ముందు గాయం తిరగబెట్టడంతో.. 10 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. కోలుకున్న బుమ్రా.. గతేడాది గొప్పగా రాణించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సత్తాచాటాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
Also Read: SA vs BAN: మొన్న భారత్.. నిన్న దక్షిణాఫ్రికా! చిన్న లక్ష్యాన్ని కాపాడుకున్న జట్లు
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. అంతకుముందు ఐర్లాండ్ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 2 వికెట్స్ తీసాడు. పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ… ‘ఇప్పుడు అందరూ నాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లే ఏడాది కిందట నేను మళ్లీ ఆడలేనని అన్నారు. నా కెరీర్ ముగిసిందన్నారు. ఇప్పుడు అది మారిపోయింది. ఎప్పుడైనా నా సామర్థ్యం మేరకు బౌలింగ్ చేస్తున్నానా? లేదా? అన్నది చూడను. నా ముందున్న సమస్యను పరిష్కరించడానికి మాత్రమే ప్రయత్నిస్తా. ఇలాంటి పిచ్‌పై అత్యుత్తమం ఏంటన్నదే ఆలోచిస్తా. ఎలా బౌలింగ్ చేయాలన్నదే చూస్తా’ అని తెలిపాడు.