Jasprit Bumrah surpasses Hardik Pandya in Most T20I Wickets: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై మూడు వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. ఈ రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో ఇప్పటివరకు బుమ్రా 64 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అధిగమించాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు చెరో 76 వికెట్లు తీసి సమంగా ఉన్నారు. పాక్‌పై బుమ్రా 3 వికెట్స్ తీయగా.. హార్దిక్ 2 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఉన్నాడు. యూజీ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్స్ పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు న్యూజీలాండ్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ పేరుపై ఉంది. అతడు 123 మ్యాచ్‌ల్లో 157 వికెట్స్ తీశాడు.
Also Read: Rohit Sharma: కంటతడి పెట్టిన పాకిస్తాన్ ప్లేయర్.. ఓదార్చిన రోహిత్ శర్మ!
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి.. పాక్‌ను దెబ్బ కొట్టాడు. పొదునైన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. తన కోటా 4 ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్న బుమ్రాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.