NTV Telugu Site icon

IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌!

Ind Vs Pak Weather Forecast

Ind Vs Pak Weather Forecast

IND vs PAK Weather Update: క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇండో-పాక్ దేశాల అభిమానులతో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్‌ అభిమానులను కలవరపెడుతున్నాడు.

భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ప్రారంభ సమయానికి కల్లా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు న్యూయార్క్‌ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం కారణంగా టాస్‌ కూడా లేటు అవుతుందని సమాచారం. అయితే సమయం గడిచేకొద్ది వర్షం పడే అవకాశాలు తక్కువ అట. ప్రస్తుతం అక్కడ ఆవకాశం మేఘావృతమై ఉంది. ఆకాశమంతా మబ్బులు పట్టి ఉన్నప్పటికీ.. మ్యాచ్‌ నిర్వహణకు అంతరాయం కలగకపోవచ్చట. ఒకవేళ మ్యాచ్‌కు వర్షం ఆటకం కలిగించినా.. ఓవర్ల కుదింపుతో జరిగే అవకాశం ఉంది. మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్‌, పాకిస్తాన్‌ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. మొత్తానికి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: Simran Choudhary: సారధి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైన సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా!

న్యూయార్క్‌ పిచ్‌ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఒక్కో రోజు ఒక్కోలా ఈ పిచ్‌ ప్రభావం చూపిస్తోంది. కొన్ని సార్లు ఎక్కువ బౌన్స్‌తో బంతి వెళ్తుంది. మరికొన్నిసార్లు అస్సలు పైకే లేవడం లేదు. ఇక అవుట్‌ ఫీల్డ్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది. దాంతో బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు కాలేదు. మరి ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి.

Show comments