India Plating 11 vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి విజయం సాధించిన భారత్.. కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. గ్రూప్- ఏలో భాగంగా జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్‌పై సునాయస విజయం సాధించిన భారత్.. అదే ఊపులో దాయాది జట్టును మట్టి కరిపించాలని చూస్తోంది. మరోవైపు పసికూన అమెరికా చేతిలో ఓడిన పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది.
నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పూర్తిగా బౌలర్లకు సహకరిస్తోంది. ఇక్కడ బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. బౌన్స్, స్వింగ్‌తో వస్తున్న బంతిని అంచనా వేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ బౌలింగ్ పటిష్టంగా ఉండడంతో.. భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే.. పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా సంజూ శాంసన్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే.. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. చూడాలి మరి కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరిని ఎంచుకుంటాడో.
Also Read: IND vs PAK: క్యురేటర్ కూడా అయోమయానికి గురవుతున్నాడు: రోహిత్ శర్మ
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్.