NTV Telugu Site icon

Jasprit Bumrah: టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. అగ్రస్థానంలో పసికూన టీమ్స్ బౌలర్లు!

Jasprit Bumrah Maiden Over

Jasprit Bumrah Maiden Over

Jasprit Bumrah now has the most maiden overs in T20Is: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. టీ20ల్లో బుమ్రాకు ఇది 11వ మెయిడిన్ ఓవర్‌. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ (10) రికార్డును అధిగమించాడు.

జస్ప్రీత్ బుమ్రా 63 మ్యాచ్‌ల్లో 11 ఓవర్లు మెయిడిన్‌గా వేశాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్ ఓవర్లు వేశాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన జాబితాలో పసికూన టీమ్స్ ఉగాండ, కెన్యా బౌలర్లు అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లు వేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కెన్యా బౌలర్ సోంగోచ్ 12 మెయిడిన్ ఓవర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టాప్ 8 ర్యాంక్స్‌ జట్లలో అత్యధిక ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్‌ మాత్రం బుమ్రానే.

Also Read: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. 3 ఓవర్లలో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి.. వికెట్స్ పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్‌ ఓవర్ ఉంది. బుమ్రా భారత్ తరఫున 36 టెస్టులు, 89 వన్డేలు, 63 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 384 వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లోబుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Show comments