NTV Telugu Site icon

IND vs ENG: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌.. అతడితో జర జాగ్రత్త విరాట్!

Virat Kohli

Virat Kohli

Virat Kohli vs Adil Rashid Battle: టీ20 ప్రపంచకప్‌ 2024 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు టీమ్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమఉజ్జీవులుగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ జట్టును ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో కూడా పరుగుల వరద పారించాడు. కానీ టీ20 ప్రపంచకప్‌ 2024లో అతడి నుంచి పెద్దగా మెరుపులు కనిపించలేదు. 100 స్ట్రైక్ రేట్‌తో ఆరు మ్యాచ్‌లలో 66 పరుగులు మాత్రమే చేశాడు. పైగా రెండుసార్లు డకౌట్‌ కావడం అటు టీమ్ మేనేజ్మెంట్, ఇటు ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. అది కాకుండా ఇప్పుడు కోహ్లీకి ఆదిల్‌ రషీద్‌ రూపంలో ముప్పు పొంచి ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అన్ని ఫార్మాట్‌లో ఏకంగా తొమ్మిది సార్లు కోహ్లీని రషీద్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ బలహీనతను విరాట్ అధిగమించాలని అందరూ కోరుకుంటున్నారు. సెమీఫైనల్‌లో విరాట్ కనీసం ఓ హాఫ్ సెంచరీ అయినా చేయాలని ఆ దేవుడిని వేడుకుంటున్నారు. సాధారణంగా తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లో రాణించే కోహ్లీ.. సెమీఫైనల్‌లో ఎలా ఆడుతాడో చూడాలి.

Also Read: IND vs ENG: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్‌ మ్యాచ్.. లేటెస్ట్‌ వెదర్ అప్‌డేట్‌ ఇదే!

మరోవైపు కెప్టెన్ రోహిత్‌ శర్మ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. సీమర్‌ జోఫ్రా ఆర్చర్‌పై రోహిత్ గణాంకాలు ఏమంత బాగాలేవు. టీ20ల్లో ఆర్చర్‌వేసిన 20 బంతులను ఆడిన రోహిత్‌.. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి మూడుసార్లు అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ బీకేర్‌ ఫుల్‌గా ఉండాలి. ఆస్ట్రేలియాపై రోహిత్ 92 రన్స్ చేసిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్‌ మరోసారి రెచ్చిపోతే.. టీమిండియాకు తిరుగుండదు.