NTV Telugu Site icon

Rohit Sharma-Fan: ప్లీజ్ ఏమనొద్దు.. పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్‌ (వీడియో)!

Rohit Sharma Fan

Rohit Sharma Fan

Fan hugged Rohit Sharma in IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం న్యూయార్క్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు దూసుకొచ్చిన ఆ అభిమాని.. హిట్‌మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. రోహిత్ కూడా అతడిని ఏమీ అనకుండా ఉండిపోయాడు. అయితే అంతలోనే పోలీసులు అప్రమత్తమై అభిమానిని పట్టుకున్నారు.

Also Read: Virat Kohli-ICC: ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ!

మైదానంలోకి దూసుకొచ్చి సదరు అభిమానిని అమెరికా పోలీసులు నేలపై పడుకోబెట్టి కాస్త కఠినంగా ప్రవర్తించారు. రోహిత్ శర్మ వద్దని చెబుతున్నా.. వారు వినిపించుకోలేదు. ఇంతలో మ్యాచ్ నిర్వాహకుల్లోని ఒకరు వచ్చి రోహిత్ రిక్వెస్ట్‌ను పోలీసులకు చెప్పగా.. అతడిని పైకి లేపి మైదానం బయటకు తీసుకెళ్లారు. అభిమాని ఏమనొద్దని పోలీసులకు రోహిత్ రిక్వెస్ట్‌ చేశాడట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అభిమానిని రక్షించేందుకు రోహిత్ చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. రోహిత్ సూపర్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ తమ అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటారన్న విషయం తెలిసిందే.

Show comments