NTV Telugu Site icon

IND vs AFG: గతం గురించి ఎందుకు.. నేను ఇప్పుడు ప్లేయర్‌ కాదు: రాహుల్ ద్రవిడ్

Rahul Dravid Reporter

Rahul Dravid Reporter

Rahul Dravid React on India’s 1997 Test Defeat vs West Indies: టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ సూపర్-8 పోరుకు సిద్ధమైంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. గతం గురించి ఎందుకని, తాను ఇప్పుడు ప్లేయర్‌ కాదని గట్టిగా సమాధానం ఇచ్చాడు.

ఆటగాడిగా విండీస్‌లో మీకు గొప్ప గణాంకాలు లేవు, ఇప్పుడు ఏం చేస్తారు? అని రాహుల్ ద్రవిడ్‌ను అడగ్గా.. ‘ఎప్పుడో జరిగిన వాటి నుంచి త్వరగా బయటకొస్తా. వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోను. ఇప్పుడు ఏం చేయాలి? అనే దానిపైనే దృష్టిపెడతా. 1997లో జరిగిన దాని గురించి నాకు ఆందోళన లేదు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే.. వేరేరకంగా మాట్లాడేవారు. టీ20 ప్రపంచకప్‌ 2024లో అఫ్గాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు మా ప్లేయర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు నేను ప్లేయర్‌గా ఇక్కడకు రాలేదు. కాబట్టి పాత వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని బదులిచ్చాడు.

Also Read: JBL Live Beam 3 Price: జేబీఎల్‌ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్‌.. 48 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌!

రాహుల్ ద్రవిడ్ 1997లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడాడు. నేడు మ్యాచ్ జరిగే బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ మైదానంలోనే అప్పుడు మ్యాచ్ జరిగింది. ఆ టెస్టులో ద్రవిడ్ 78, 2 పరుగులు చేసినా.. టీమిండియా మాత్రం ఓడిపోయింది. అదే విషయాన్ని సదరు రిపోర్టర్‌ అడగ్గా.. ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ది వాల్ ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌తో అతడి పదవీకాలం ముగుస్తుంది.