NTV Telugu Site icon

Hardik Pandya: సులువుగా వదిలిపెట్టను.. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా!

Hardik Pandya Odi

Hardik Pandya Odi

Hardik Pandya on Problems: ఐపీఎల్‌ 2024లో కెప్టెన్‌గా విఫలం, టీ20 ప్రపంచకప్‌ 2024 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు, విడాకుల రూమర్లు.. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను వరుసగా చుట్టుముట్టాయి. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ అనంతరం అన్నింటిని పక్కనపెట్టి లండన్ వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు. తాజాగా భారత జట్టుతో కలిసిన హార్దిక్.. బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ గత కొన్ని నెలలుగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. ఏ సమస్యను సులువుగా వదిలిపెట్టనని, చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా అని తెలిపాడు.

‘జీవితం అనే యుద్ధంలో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. జీవితం లేదా మైదానంలో కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని సులువుగా వదిలేస్తే అనుకున్న ఫలితాన్ని సాధించలేం. ఇలాంటివి ఎదుర్కోవడం కష్టమని నాకు తెలుసు. అయితే వాటన్నింటిని దాటుకొని ముందుకు సాగడంపైనే దృష్టి పెడతా. గతంలో నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు ఎలాంటి విధానం అనుసరించానో.. ఇప్పుడూ అలాగే ప్రయత్నిస్తా. పోరాడుతూ ఉంటే పరిస్థితుల్లో మార్పు వస్తుంది’ అని హార్దిక్‌ పాండ్యా చెప్పాడు.

Also Read: Venkatesh Iyer Marriage: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్‌.. ఫొటోస్ వైరల్!

‘జీవితం మొత్తం చెడు రోజులే ఉండవు. మంచి రోజులూ కూడా ఉంటాయి. క్లిష్ట దశలను దాటి ముందుకు వెళ్తుండాలి. నా జీవితంలో ఇలాంటి క్లిష్ట దశలను ఎన్నోసార్లు అనుభవించా. వాటి నుంచి బయటకు వచ్చా. విజయం వచ్చినపుడు ఎక్కువ సీరియస్‌గా తీసుకోను. తర్వాత ఏం చేయాలనేదానిపైనే దృష్టిపెడతా. కష్ట సమయాల్లోనూ ఇలానే ఆలోచిస్తా. ఎప్పుడూ సమస్యల నుంచి పారిపోవాలని చూడను. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా. త్వరలోనే అన్ని అనుకూలంగా మారుతాయి’ అని హార్దిక్‌ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 హార్దిక్ కీలకం కానున్నాడు.