టీ20 ప్రపంచకప్ 2024 కోసం దాదాపుగా భారత్ జట్టు మొత్తం యూఎస్ చేరుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా జట్టుతో కలవలేదు. మెగా టోర్నీ జూన్ 2 నుంచి ఆరంభం కానుండగా.. జూన్ 5న ఐర్లాండ్‌తో రోహిత్ సేన తన తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు జూన్ 1న బంగ్లాతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. దీంతో భారత క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సరదాగా న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.
Also Read: Cinema Lovers Day 2024: సినీ ప్రియులకు శుభవార్త.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడొచ్చు!
న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలను టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. యశస్వి పోస్టుపై ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ‘తోటల్లో నడుస్తున్నట్లు ఏంటా నడక అని ఫీల్డర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ మాటలు స్టంప్స్ మైకుల్లో ‘స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ‘యశస్వి జాగ్రత్త.. నువ్ తోటల్లో తిరుగుతున్నట్లు రోహిత్‌కు తెలుసా?’ అని సూర్య కామెంట్ చేశాడు. ఈ పోస్టుకు నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు.
Yashasvi Jaiswal in New York for his first World Cup for India…!!!! 🇮🇳 pic.twitter.com/oTTZtIx5Wv
— Tanuj Singh (@ImTanujSingh) May 28, 2024
