Site icon NTV Telugu

T20 World Cup 2026: ఎవరు ధైర్యం చేస్తారో చూడాలి.. పాక్ స్పిన్నర్ తారిక్ బౌలింగ్పై అశ్విన్ కామెంట్స్ వైరల్!

Aswin

Aswin

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందే ఆసక్తికర చర్చ మొదలైంది. పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతని స్టాప్- స్టార్ట్ శైలిపై ఇప్పటికే పలువురు నిపుణులు, అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ప్రత్యేక యాక్షన్‌తో తారిక్ సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యూహాన్ని సూచించారు. తారిక్ యాక్షన్‌లో ఒక లోపం ఉందని పేర్కొన్న అశ్విన్, దాన్ని భారత బ్యాటర్లు ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

Read Also: AP Budget: నేడే ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

అయితే, తారిక్ డెలివరీకి ముందు కాసేపు ఆగితే, బ్యాటర్ క్రీజ్ నుంచి తప్పుకోవచ్చని ఆర్. అశ్విన్ చెప్పారు. బంతి ఎప్పుడు విడుస్తాడో అర్థం కావడం లేదని చెప్పి బ్యాటర్ పక్కకు తప్పుకోవచ్చు అని తన యూట్యూబ్ చానెల్ ‘Ash ki Baat’లో వ్యాఖ్యానించారు. “అలా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారో చూడాలి” అని పేర్కొన్నారు. ఒకవేళ నేను క్రికెట్ ఆడి ఉంటే.. ఖచ్చితంగా ప్రయత్నించేవాడినని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల పరిధిలో ఉన్న ప్రతి అవకాశాన్ని నేను ఉపయోగించేవాడిని.. ఈ పరిస్థితిలో అంపైర్ బౌలర్‌కి హెచ్చరిక ఇవ్వాలా, లేక బ్యాటర్‌కా అన్నది నిర్ణయించాల్సి ఉంటుంది.. ఎక్కువ అవకాశాలు బ్యాటర్ వైపే ఉంటాయని తెలిపారు.

Read Also: Malavika Mohanan : రూమర్లకు మాళవిక మోహనన్ చెక్.. ‘ది రాజా సాబ్’ స్టంట్స్ నావే!

ఇక, భారత జట్టు బ్యాటర్లు నిజంగా ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తారో లేదో అనుమానమేనని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఇక, ఉస్మాన్ తారిక్ ఇప్పటివరకు నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 11 వికెట్లు తీసుకున్నాడు. అతని సగటు 7.90 కాగా, ఎకానమీ రేట్ ఒక్కో బంతికి ఒక పరుగుకంటే తక్కువగా ఉంది. దీంతో భారత్- పాకిస్థాన్ పోరుకు ముందు అతని యాక్షన్‌పై చర్చ మరింత ఉత్కంఠను రేపుతోంది.

Exit mobile version