Andre Russell: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రస్సెల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andre Russell equaled Dwayne Bravo’s unique Record: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000కి పైగా రన్స్, 50 ప్లస్ వికెట్స్ తీసిన రెండో విండీస్ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఉగాండతో మ్యాచ్‌లో 17 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో విండీస్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక బౌలింగ్‌లో ఓ వికెట్ తీసాడు.
వెస్టిండీస్ తరఫున ఇప్పటివరకు 77 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆండ్రీ రస్సెల్.. 1000 పరుగులు చేసి 52 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో రస్సెల్ కంటే ముందు డ్వేన్ బ్రావో ఉన్నాడు. వెస్టిండీస్ తరఫున 91 టీ20ల్లో 1255 పరుగులు చేసిన బ్రావో.. 78 వికెట్లు పడగొట్టాడు. 2012, 2014లో టీ20 ప్రపంచకప్ టైటిల్స్ గెలిచిన విండీస్ జట్టులో బ్రావో ఉన్నాడు. బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: IND vs PAK: క్యురేటర్ కూడా అయోమయానికి గురవుతున్నాడు: రోహిత్ శర్మ
ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డుపై హిట్టర్ నికోలస్ పూరన్ కన్నేశాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన గేల్ రికార్డును అధిగమించేందుకు 3 పరుగుల దూరంలో ఉన్నాడు. ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో 22 పరుగులు చేసిన పూరన్.. 90 టీ20ల్లో 1897 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ 79 టీ20ల్లో 1899 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్లో గేల్ రికార్డు బద్దలుకానుంది.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..