T20 World Cup 2024: సూపర్ 8కు అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్!
- అఫ్గానిస్థాన్ సంచలనం
- సూపర్ 8కు అఫ్గాన్
- న్యూజిలాండ్ ఎలిమినేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Enters T20 World Cup 2024 Super 8: టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. శుక్రవారం పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-సీలో ఉన్న అఫ్గాన్.. ఆడిన మూడింట్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మూడు మ్యాచ్‌లలో గెలిచిన వెస్టిండీస్ కూడా ఇప్పటికే సూపర్ 8కు దూసుకెళ్లింది. దాంతో గ్రూప్-సీలో ఉన్న న్యూజిలాండ్ అధికారికంగా ఎలిమినేట్ అయింది.
టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-సీలో వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ ఉన్నాయి. మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచిన వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ సూపర్ 8కు దూసుకెళ్లాయి. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన న్యూజిలాండ్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో కివీస్ గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఉగాండా ఒక మ్యాచ్ గెలవగా.. పపువా న్యూగినియా ఖాతా తెరవలేదు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా 19.5 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌట్ అయింది. కిప్లిన్ (27; 32 బంతుల్లో 2 ఫోర్లు) టాప్ స్కోరర్. అఫ్గానిస్థాన్ పేసర్ ఫజల్లా ఫరూకీ (3/16) మూడు వికెట్లతో సత్తాచాటాడు. స్వల్ప ఛేదనను అఫ్గాన్ టీమ్ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. గుల్బదీన్ నైబ్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మహ్మద్ నబీ (16 నాటౌట్), అజ్మతుల్లా (13; 18 బంతుల్లో, 1 ఫోర్) రాణించారు.
తాజావార్తలు
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!