Site icon NTV Telugu

Adam Gilchrist: రోహిత్ బయట చెప్పిన మాటలను.. మైదానంలో చేసి చూపించాడు!

Rohit Sharma Trolls

Rohit Sharma Trolls

Adam Gilchrist on Rohit Sharma Batting against Australia: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాపై రోహిత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను.. రోహిత్ మైదానంలో చేసి చూపించాడన్నాడు. యువ క్రికెటర్లకు హిట్‌మ్యాన్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై కేవలం 41 బంతుల్లోనే రోహిత్ 92 పరుగులు చేశాడు. స్టార్క్‌, కమిన్స్,హేజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లను సైతం వదలలేదు. దాంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

Also Read: Kamal Haasan: కావాలనే నా రెమ్యునరేషన్‌ పెంచా.. కమల్‌హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను అతడు మైదానంలో చేసి చూపించాడు. యువ క్రికెటర్లకు అతడు స్ఫూర్తిగా నిలిచాడు. ఐపీఎల్‌ 2024 గణాంకాలను చూసి చాలామంది ట్రోల్స్ చేశారు. వాటన్నింటికీ ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చాడు. జట్టులో తన విలువేంటో రోహిత్ చాటి చెప్పాడు. బౌలర్లపై ఎప్పుడు ఆధిపత్యం ప్రదర్శించాలో రోహిత్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌ ముందుండి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే.. మిగతా ప్లేయర్స్ స్ఫూర్తి పొందుతారు. మ్యాచ్‌ సమయంలో చాలామంది కెప్టెన్లు ఫలితాల గురించి ఆలోచించం లేదా ఆడే విధానంపై దృష్టిపెడతాం అని అంటారు. రోహిత్ మాత్రం దూకుడుగానే తన ఇన్నింగ్స్‌ ఉంటుందని చెప్పాడు’ అని తెలిపాడు. ఇక సెమీస్‌లో గురువారం ఇంగ్లండ్ జట్టును భారత్ ఎదుర్కోవాల్సి ఉంది.

 

 

Exit mobile version