Team India New jersey: అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జూన్ 1 నుంచి జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కి టీమిండియా క్రికెట్ జట్టు కొత్త జెర్సీని రిలీజ్ చేసింది. అధికారిక కిట్ స్పాన్సర్ అయిన అడిడాస్.. ధర్మశాల స్టేడియం బ్యాక్ డ్రాప్‌తో రోహిత్‌శర్మ, జడేజా, కుల్దీప్‌యాదవ్ కనిపిస్తున్న ఓ వీడియోను ‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్‌తో సోమవారం నాడు విడుదల చేయగా.. అది నారింజ, నీలం రంగుల కలయికతో కూడి ఉంది. ఈ జెర్సీపై వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే ఈ జెర్సీపై క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీ ఉన్నట్లు ఉందని కొందరు అంటుంటే.. బీజేపీ పార్టీ రంగును పోలి ఉందని మరి కొందరు విమర్శలకు దిగుతున్నారు.
Read Also: Gujarath: గుజరాత్‌లో ఉదయం 9 గంటల వరకు 9.87% ఓటింగ్ నమోదు
కాగా, టీ20 ప్రపంచకప్ 2024 కోసం దాదాపుగా అన్ని బోర్డులు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి. భారత జట్టు సభ్యులను బీసీసీఐ గత వారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని వేచి చూస్తోంది. జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ ట్రోఫీ వేట స్టార్ట్ కానుంది. ఇక, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జూన్ 9వ తేదీన భారత్ తలపడబోతుంది.
