T20 World Cup 2026: చిన్న టీమ్‌ల పోరాటం, టాప్ జట్లకు జులక్.. అభిమానులకు నాన్‌స్టాప్ థ్రిల్!
- అభిమానులకు హార్ట్ ఎటాక్‌ను తెప్పిస్తున్న మ్యాచ్‌లు
- చిన్న టీమ్‌ల పోరాటం, టాప్ జట్లకు జులక్
- క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ థ్రిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆరంభం నుంచే అభిమానులకు హార్ట్ ఎటాక్‌ను తెప్పిస్తున్నాయి. పెద్ద జట్లు, చిన్న జట్లు అనే తేడా లేకుండా.. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్లుతూ ఆహా అనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, అమెరికా లాంటి టీమ్స్ అద్భుత ప్రదర్శన చేసి.. టాప్ టీమ్‌లను ఓడించినంత పని చేశాయి. ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రపంచంలో మారుతున్న శక్తి సమీకరణాలకు అద్దం పడుతోంది.
నెదర్లాండ్స్ పాకిస్థాన్‌పై గెలుపుకు చాలా దగ్గరగా వచ్చింది. చివరి క్షణాల్లో మ్యాచ్ చేజారినా.. డచ్ జట్టు పోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాకిస్థాన్ లాంటి బలమైన జట్టును ఒత్తిడిలోకి నెట్టడం చిన్న విషయం కాదు. అలాగే స్కాట్లాండ్ కూడా వెస్టిండీస్‌పై అద్భుతంగా పోరాడింది. పవర్ హిట్టర్లతో పేరున్న కరీబియన్ జట్టుకు స్కాట్లాండ్ గట్టి పోటీ ఇచ్చి మ్యాచ్‌ను చివరి వరకు ఉత్కంఠ భరితంగా మార్చింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ జట్టు కూడా బాగా ఆడింది. ప్రపంచ క్రికెట్‌లో కొత్తగా ఎదుగుతున్న యూఎస్ఏ.. టీమిండియాను వణికించింది. ఈ మ్యాచ్ అమెరికా క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది.
Also Read
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
Also Read: T20 World Cup 2026: మ్యాచ్ ఆడకపోవడం ఏంటి?.. పాకిస్థాన్‌పై గంగూలీ ఫైర్!
అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా హై వోల్టేజ్‌గా సాగింది. టాప్ ప్లేయర్స్ ఉన్న కివీస్‌ను అఫ్గాన్ చివరి వరకు పోటీలో నిలిచింది. మ్యాచ్‌ను క్లైమాక్స్ వరకు తీసుకెళ్లింది. ఇక నేపాల్ ప్రదర్శన అయితే టోర్నీ హైలైట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇంగ్లాండ్‌పై గెలుపు అంచుల వరకూ వెళ్లి.. చివరి క్షణాల్లో ఓటమి పాలైంది. నేపాల్ ఆటతీరు ప్రపంచాన్ని మెప్పించింది. క్రికెట్‌లో కొత్త శక్తిగా నేపాల్ ఎదుగుతోందని మరోసారి నిరూపించింది. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. చిన్న క్రికెట్ జట్లు చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, పోరాటం చూస్తే.. ఈ ప్రపంచకప్ చివరి వరకు ఇలాగే థ్రిల్ ప్యాక్‌డ్‌గా సాగనుందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్‌లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!