T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!
- చివరి అంకానికి చేరిన టీ20 ప్రపంచ కప్ 2026
- ముగిసిన సూపర్-8 షెడ్యూల్
- సెమీస్ షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 Semi Final Schedule: భారత్, శ్రీలంకలు వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026 చివరి అంకానికి చేరింది. వారం రోజులుగా రసవత్తరంగా సాగిన సూపర్-8 షెడ్యూల్ ముగిసింది. అత్యుత్తమంగా ఆడిన నాలుగు టీమ్స్ సెమీఫైనల్ చేరాయి. సూపర్-8 గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ చేరగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరాయి. మార్చి 4, 5న సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్ షెడ్యూల్ ఓసారి చూద్దాం.
గ్రూప్-1లో దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. 6 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. సూపర్-8లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వేలను సఫారీ టీమ్ ఓడించింది. భారత్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి.. 4 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణాఫ్రికాపై ఓడిన భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయం సాధించింది. వెస్టిండీస్ 3 మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచి 2 పాయింట్లు, జింబాబ్వే అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడి 0 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Also Read
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు
- Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
- IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
- Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్‌గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
గ్రూప్-1లో ఇంగ్లాండ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకలపై గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి (శ్రీలంక), మరొకటి (ఇంగ్లాండ్) ఓడింది. పాకిస్థాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 3 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ ఒకటి గెలిచి, మరొకటి ఓడినా.. కివీస్ కంటే తక్కువ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంక మ్యాచ్‌ల్లోనూ ఓడి చెత్త ప్రదర్శన చేసింది.
మార్చి 4 తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుంది. ముంబైలో భారత్, ఇంగ్లాండ్ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. రెండు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ఆరంభం కానున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 8న నరేంద్ర మోడీ మైదానంలో జరగనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సెమీస్ షెడ్యూల్:
# మార్చి 4: తొలి సెమీఫైనల్
న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా
వేదిక: కోల్‌కతా
సమయం: రాత్రి 7 గంటలకు
# మార్చి 5: రెండో సెమీఫైనల్
భారత్ vs ఇంగ్లాండ్
వేదిక: ముంబై
సమయం: రాత్రి 7 గంటలకు
తాజావార్తలు
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?