T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!

  • సంజూ శాంసన్‌కు షాక్
  • ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్
  • సెలెక్టర్లను ఆలోచనలో పడేసిన సంజూ ఫామ్
Sanju Samson Form

Sanju Samson Form

టీ20 వరల్డ్ కప్ 2026పై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో టీమిండియా ప్లాన్స్ ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. సంజూ శాంసన్‌కు ఈసారి కూడా టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఓపెనర్‌గా ఆయన స్థానం మరోసారి ప్రమాదంలో పడినట్టు క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకు కారణం ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించడమే.

సంజూ శాంసన్ ఓపెనర్‌గా చివరి 11 ఇన్నింగ్స్‌లలో ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇందులో ఇంగ్లాండ్‌తో 5, సౌతాఫ్రికాతో 1, న్యూజిలాండ్‌తో 5 ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. సంజూ ఫామ్ సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది. కీలక టోర్నమెంట్‌లో అనుభవంతో పాటు కన్సిస్టెన్సీ అవసరమన్నది టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయం. ఇలాంటి పరిస్థితి టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా ఎదురైంది. ఆ టోర్నమెంట్‌కు ముందు వరకు సంజూ పేరు వినిపించినా.. చివరి నిమిషంలో రిషభ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. అప్పట్లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ పంత్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. అదే సీన్ ఇప్పుడు 2026లో కూడా రిపీట్ అవుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.

Also Read: AP News: రేపు చంద్రబాబు, పవన్, మాధవ్ కీలక సమావేశం!

టీ20 వరల్డ్ కప్ 2026కి వస్తే.. ఇషాన్ కిషన్ ఓపెనర్, వికెట్ కీపర్‌గా దాదాపు ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే టీ20ల్లో అతని అగ్రెసివ్ స్టైల్, పవర్‌ప్లేలో వేగంగా రన్స్ చేయగల సామర్థ్యం సెలెక్టర్లను ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇషాన్ కిషన్-అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్‌ను కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది టీ20 వరల్డ్ కప్ 2026కి టీమిండియా ఫ్యూచర్ రోడ్‌ మ్యాప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. మొత్తానికి, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన సమయంలో ఫామ్ చూపించలేకపోవడం వల్ల సంజూ శాంసన్ మరోసారి టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది.