T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!
- సంజూ శాంసన్‌కు షాక్
- ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్
- సెలెక్టర్లను ఆలోచనలో పడేసిన సంజూ ఫామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2026పై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో టీమిండియా ప్లాన్స్ ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. సంజూ శాంసన్‌కు ఈసారి కూడా టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఓపెనర్‌గా ఆయన స్థానం మరోసారి ప్రమాదంలో పడినట్టు క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకు కారణం ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించడమే.
సంజూ శాంసన్ ఓపెనర్‌గా చివరి 11 ఇన్నింగ్స్‌లలో ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇందులో ఇంగ్లాండ్‌తో 5, సౌతాఫ్రికాతో 1, న్యూజిలాండ్‌తో 5 ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. సంజూ ఫామ్ సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది. కీలక టోర్నమెంట్‌లో అనుభవంతో పాటు కన్సిస్టెన్సీ అవసరమన్నది టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయం. ఇలాంటి పరిస్థితి టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా ఎదురైంది. ఆ టోర్నమెంట్‌కు ముందు వరకు సంజూ పేరు వినిపించినా.. చివరి నిమిషంలో రిషభ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. అప్పట్లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ పంత్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. అదే సీన్ ఇప్పుడు 2026లో కూడా రిపీట్ అవుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
Also Read: AP News: రేపు చంద్రబాబు, పవన్, మాధవ్ కీలక సమావేశం!
టీ20 వరల్డ్ కప్ 2026కి వస్తే.. ఇషాన్ కిషన్ ఓపెనర్, వికెట్ కీపర్‌గా దాదాపు ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే టీ20ల్లో అతని అగ్రెసివ్ స్టైల్, పవర్‌ప్లేలో వేగంగా రన్స్ చేయగల సామర్థ్యం సెలెక్టర్లను ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇషాన్ కిషన్-అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్‌ను కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది టీ20 వరల్డ్ కప్ 2026కి టీమిండియా ఫ్యూచర్ రోడ్ మ్యాప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. మొత్తానికి, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన సమయంలో ఫామ్ చూపించలేకపోవడం వల్ల సంజూ శాంసన్ మరోసారి టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!