T20 World Cup 2026: “బంగ్లాదేశీయులు మా సోదరులు”.. బాయ్‌కాట్ వివాదంపై పాక్ కెప్టెన్..

  • ‘‘బంగ్లాదేశీయులు మా సోదరులు’’..
  • బాయ్‌కాట్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ..
Pakistan

Pakistan

T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 వివాదం పెరుగుతోంది. బంగ్లాదేశ్ టోర్నీని బహిష్కరించడంపై పాకిస్తాన్‌, భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘పాక్ బంగ్లాదేశ్‌తో నిలుస్తుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తూ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Shocking: యువతిపై అత్యాచారం, 17 మందికి డీఎన్ఏ పరీక్షలు.. నిజం తెలిసి అంతా షాక్..

టోర్నీ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు గురికావడంపై సల్మాన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘బంగ్లాదేశీయలు మా సోదరులు. వారు టోర్నీ ఆగకపోవడం విచారకరం’’ అని అన్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు అసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్ బహిష్కరించాలనుకున్న పాకిస్తాన్ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ ను టోర్నీ నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.