T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ హ్యాట్రిక్స్.. ఆస్ట్రేలియాదే హవా, భారత్ నుంచి నో బౌలర్!
- పొట్టి ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువ
- హ్యాట్రిక్ సాధించడం బౌలర్లకు చాలా కష్టం
- ఆస్ట్రేలియాదే హవా, భారత్ నుంచి నో బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టీ20 వరల్డ్‌కప్’ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, అనూహ్య మలుపులతో మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా కనిపించే పొట్టి ఫార్మాట్‌లో ‘హ్యాట్రిక్’ సాధించడం బౌలర్లకు చాలా కష్టం. అలాంటిది కొందరు బౌలర్లు టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్స్ పడగొట్టారు. ఇప్పటివరకు జరిగిన వరల్డ్‌కప్‌లలో కొద్దిమంది బౌలర్లు మాత్రమే ఈ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ జాబితా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఘనత ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి దక్కింది. 2007 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై వరుసగా మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అప్పట్లో ఈ ఘనత టీ20 క్రికెట్‌లో బౌలర్లకు కూడా ఎంత ప్రాధాన్యం ఉందో నిరూపించింది. అప్పట్లో బ్రెట్ లీ మంచి ఫామ్ మీదున్నాడు. బ్రెట్ లీ బౌలింగ్ చేస్తున్నాడంటేనే.. స్టార్ బ్యాటర్ కూడా డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. 2007 నుంచి 2021 వరకు మరో హ్యాట్రిక్ పడలేదు.
Also Read
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
2021 టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్స్ వరుసగా నమోదయ్యాయి. ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫర్ నెదర్లాండ్స్‌పై హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే టోర్నీలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ దక్షిణాఫ్రికాపై, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్ తీసి ఔరా అనిపించారు.
Also Read: T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
2022 టీ20 వరల్డ్‌కప్‌లో అసోసియేట్ దేశాల బౌలర్లు కూడా సత్తా చాటారు. యూఏఈ తరఫున కార్తిక్ మేయప్పన్ శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించగా.. ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ న్యూజిలాండ్‌పై ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇది చిన్న జట్ల ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అసాధారణ ప్రదర్శన చేశాడు. బంగ్లాదేశ్‌పై ఒక హ్యాట్రిక్, ఆఫ్ఘనిస్తాన్‌పై మరో హ్యాట్రిక్ సాధించి ఒకే టోర్నీలో రెండు హ్యాట్రిక్స్ తీసిన బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిన్స్ ప్రదర్శన టోర్నీకి హైలైట్‌గా నిలిచింది.
2024 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్ అమెరికాపై హ్యాట్రిక్ పడగొట్టాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్ హ్యాట్రిక్స్ జాబితాలో మరో కొత్త పేరు చేరింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఈ హ్యాట్రిక్స్ అన్నీ బౌలింగ్ ఎంత కీలకమో మరోసారి రుజువు చేశాయి. అయితే ఇప్ప్పటివరకు భారత్ నుంచి ఒక్క బౌలర్ కూడా హ్యాట్రిక్ తీయలేదు. 2026 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ చూస్తామో చూడాలి. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 2026 వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. పొట్టి టోర్నీలో ఈసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!