NTV Telugu Site icon

T20 World Cup 2024: హమ్మయ్య.. సూప‌ర్‌-8 బెర్తులు ఖరారు.. ఇక ఏ జట్టు ఎవరితో ఎక్కడ తలపడనున్నాయంటే..

T20 World Cup 2024 Super 8 Teams

T20 World Cup 2024 Super 8 Teams

T20 World Cup 2024 Super 8 Teams : అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024 రెండో స్టేజ్‌ సూప‌ర్‌-8 కు చెందిన అన్ని జ‌ట్ల వివ‌రాలు ఖ‌రారు అయ్యాయి. ఈ రెండో స్టేజ్‌ లో ఏ జ‌ట్టు ఎవ‌రితో ఎక్కడ ఆడుతుందో తేలిపోయింది. ఇక ఎక్క‌డ ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఎవరితో ఉంటుందో.. తాజగా పూర్తి వివ‌రాల‌ను ఐసీసీ వెల్ల‌డించింది. గ్రూప్ A నుంచి ఇండియా (India) , అమెరికా ( USA ).., గ్రూప్ B నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌.., గ్రూప్ C నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌, వెస్టిండీస్‌.., గ్రూప్ D నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ (Bangladesh) జ‌ట్లు సూప‌ర్‌-8 కు అర్హ‌త సాధించాయి.

ఇక సూప‌ర్‌-8 మ్యాచ్‌ లను మొత్తం 8 జ‌ట్ల‌ను రెండు గ్రూపుల‌గా విభ‌జించారు. అందులో గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్ లు ఉండగా., గ్రూప్ 2లో వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, అమెరికా జ‌ట్లు ఉన్నాయి. ఇక సూప‌ర్‌-8 రౌండ్ లో ప్ర‌తి జ‌ట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇలా అడగా చివరగా రెండు గ్రూపుల్లో టాప్ గా నిలిచే 2 జ‌ట్లు సెమీఫైన‌ల్‌ కు అర్హ‌త సాధిస్తాయి. ఇక సూప‌ర్‌-8 మ్యాచ్‌ ల టైం టేబుల్ ఇలా ఉంది.

జూన్ 19: అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా, నార్త్ సౌండ్, ఆంటిగ్వా

జూన్ 19: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్, గ్రోస్ ఐలెట్, సెయింట్ లూసియా

జూన్ 20: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్

జూన్ 20: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా

జూన్ 21: ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రోస్ ఐలెట్, సెయింట్ లూసియా

జూన్ 21: యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్

జూన్ 22: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా

జూన్ 22: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, అర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్

జూన్ 23: యుఎస్ఎ వర్సెస్ ఇంగ్లాండ్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్

జూన్ 23: వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా, నార్త్ సౌండ్, ఆంటిగ్వా

జూన్ 24: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, గ్రోస్ ఐలెట్, సెయింట్ లూసియా

జూన్ 24: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, అర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్.

ఇక జూన్ 20వ తేదీన బార్బ‌డోస్‌ లో ఇండియా, ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ క‌రీబియ‌న్ వేదిక‌గా ఆడ‌నున్న‌ది. ఆ తర్వాత జూన్ 22వ తేదీన బంగ్లాదేశ్‌ తో ఇండియా రెండ‌వ మ్యాచ్ ఆడ‌బోతుంది. ఇక చివరి మ్యాచ్ ను జూన్ 24వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడ‌నున్న‌ది.