Site icon NTV Telugu

GT vs SRH: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. సన్‌రైజర్స్ లక్ష్యం ఎంతంటే?

Gt 20 Overs

Gt 20 Overs

Sunrisers Hyderabad Need To Score 189 To Win Match Against GT: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (101) సెంచరీతో చెలరేగడం, సుదర్శన్ (47) పరుగులతో రాణించడంతో.. జీటీ అంత స్కోరు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ ఆశాజనకంగా రాణించలేదు. నలుగురు డకౌట్ అవ్వగా, ఇతర బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఇక ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. మూడు వికెట్లు తీయడంతో పాటు ఒక రనౌట్ చేశాడు. కేవలం రెండంటే రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతగాడు ఐదు వికెట్లతో విజృంభించాడు.

Python As Weapon: పెంపుడు పైథాన్‌ను ఆయుధంగా వాడి.. వ్యక్తిపై దాడి

తొలుత సన్‌రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు గుజరాత్ రంగంలోకి దిగింది. ఆరంభంలోనే ఆ జట్టుకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే వృద్ధిమాన్ సాహా సున్నా పరుగులకి ఔట్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి శుబ్మన్ గిల్ తన జట్టుని ముందుకు నడిపించాడు. ఓవైపు శుబ్మన్ బౌండరీల మోత మోగిస్తే, మరోవైపు సుదర్శన్ అతనికి స్టాండ్ ఇస్తూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీళ్లిద్దరు క్రీజులో ఉన్నంతవరకు గుజరాత్ స్కోరు బుల్లెట్ ట్రైన్‌లో పరుగులు పెట్టింది. సన్‌రైజర్స్ బౌలర్లు వీళ్లని కట్టడి చేయలేకపోయారు. ఎడాపెడా షాట్లతో వాళ్లు మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. రెండో వికెట్‌కి ఏకంగా 147 పరుగులు జోడించారు. కానీ.. ఎప్పుడైతే సుదర్శన్ ఔట్ అయ్యాడో, అప్పటి నుంచి గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

Ex-Girlfriend Intimate Photos: మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని వైరల్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు

గిల్ సైతం సెంచరీకి చేరువగా వచ్చినప్పుడు నెమ్మదించడంతో.. గుజరాత్ స్కోరు నత్తనడకన సాగింది. అటు.. క్రీజులో అడుగుపెడుతున్న బ్యాటర్లు సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి ఎక్కువసేపు నిలకడగా రాణించలేకపోయారు. మైదానంలో అడుగుపెట్టినట్టే పెట్టి, పెవిలియన్ బాట పట్టారు. ఇక చివరి ఓవర్‌లో అయితే భువనేశ్వర్ వికెట్ల వర్షం కురిపించాడు. తొలి బంతికే గిల్‌ని ఔట్ చేసిన అతడు, ఆ వెంటనే రషీద్ ఖాన్‌ని ఔట్ చేశాడు. మూడో బంతికి పరుగు తీసేందుకు ప్రయత్నిస్తే, రనౌట్ చేశాడు. ఇక ఐదో బంతికి షమీ కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో.. జీటీ 188 పరుగులకే పరిమితం అయ్యింది. నిజానికి.. 14 ఓవర్లలో 147 పరుగులు ఉన్నప్పుడు.. జీటీ సునాయాసంగా 200 పరుగులు మైలురాయిని దాటేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు తమ సత్తా చాటి, 188 కే కట్టడి చేశారు.

Exit mobile version