Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar Urges BCCI to Drop Average Fielders in Team India: జింబాబ్వేపై సిరీస్ గెలిచినా.. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు సిరీస్‌ల్లో భారత జట్టు ఫీల్డింగ్ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ, జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు. జట్టులో సగటు స్థాయి ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు ఇకపై చోటు కల్పించొద్దని, అలాంటి ఆటగాళ్లను ధైర్యంగా జట్టు నుంచి తప్పించాలని సన్నీ చెప్పుకొచ్చారు.
‘స్పోర్ట్‌స్టార్’లో తన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ఒక కెప్టెన్ ముగ్గురు లేదా నలుగురు బలహీన ఫీల్డర్ల కోసం ప్రత్యేక ఫీల్డింగ్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. ‘ఒక ఆటగాడు సగటు స్థాయి ఫీల్డర్ అయితే అతనికి జట్టులో స్థానం ఉండకూడదు. అలాంటి ఆటగాళ్లకు డోర్ ద్వారం చూపించి.. వెళ్లిపోండని చెప్పాలి. బంతి వారి వైపు వెళ్లకూడదని కెప్టెన్ ప్రత్యేకంగా ఫీల్డింగ్ అమర్చాల్సిన పరిస్థితి రావడం సరైంది కాదు. సగటు స్థాయి ఫీల్డర్లకు భారత జట్టులో చోటు ఇవ్వొద్దు’ అని గవాస్కర్ స్పష్టం చేశారు.
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
‘ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో వరుస సిరీస్ పరాజయాల అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జట్టు తన లోపాలను నిజాయితీగా విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. బ్యాటర్లు తమ ఇమేజ్ను నిలబెట్టుకునేందుకు కాకుండా, పరిస్థితికి అనుగుణంగా ప్రతి బంతిని అంచనా వేసి ఆడాలి. టీ20 ఫార్మాట్లో తరచూ భారీ షాట్లు ఆడాల్సి వచ్చినా, వన్డేల్లో మాత్రం కాస్త సమయం తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని గవాస్కర్ చెప్పారు.
ఐపీఎల్‌లోని చిన్న బౌండరీలు కూడా భారత బ్యాటర్లకు ఇబ్బంది కలిగిస్తున్నాయని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ‘భారతదేశంలోని ఫ్లాట్ పిచ్‌లతో పాటు చిన్న బౌండరీల కారణంగా మిస్హిట్లు కూడా సిక్సర్లుగా మారుతున్నాయి. కానీ ఇంగ్లండ్ వంటి దేశాల్లో పెద్ద బౌండరీల కారణంగా అదే షాట్లు క్యాచ్‌లుగా వెళుతున్నాయి. విదేశీ పరిస్థితుల్లో విజయవంతం కావాలంటే బ్యాటర్లు తమ ఆటతీరును పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’ అని సన్నీ సూచించారు. టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు, బ్యాటింగ్‌లో ఓర్పు, సరైన షాట్ ఎంపిక, విదేశీ పరిస్థితులకు అనుగుణంగా ఆడే నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!