టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతు పలికాడు. విరాట్ ఫామ్ గురించి మాట్లాడేవారు రోహిత్ పేరు ఎందుకు ఎత్తట్లేదని ఆయన ప్రశ్నించాడు. రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడలేదని… ఇతర ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని.. ఒక్క విరాట్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందో తనకు అర్థం కావట్లేదని సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవాలంటే ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ చక్కటి అవకాశమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ టెంపరరీ, క్వాలిటీ పర్మినెంట్ అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
Read Also: Cricket: కామన్వెల్త్ క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ఏపీ అమ్మాయికి అవకాశం
కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో ఐదు సిక్సర్లు కొడితే వన్డే చరిత్రలో 250 సిక్సర్లు పూర్తిచేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. రోహిత్ తర్వాత ధోనీ (229), సచిన్ (195), గంగూలీ (190), యువరాజ్ సింగ్ (155), సెహ్వాగ్ (136) ఉన్నారు. అంతర్జాతీయంగా చూస్తే షాహిద్ అఫ్రిదీ 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ 245 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
