Sri Lanka All Out For 215 Runs Against India In Second ODI: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదట్లో శ్రీలంక శుభారంభమే చేసింది. ఓపెనర్ ఫెర్నాండో (20) ఆరవ ఓవర్‌లో 29 పరుగుల వద్ద ఔటైనా.. ఆ తర్వాత నువానిదు ఫెర్నాండో (50), కుసల్ మెండిస్ (34) కలిసి అద్భుతంగా రాణించారు. క్రీజులో ఉన్నంతసేపు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. వరుస బౌండరీలు బాదుతూ పరుగుల వర్షం కురిపించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లు జోరు చైసి.. ఈసారి శ్రీలంక జట్టు భారత్‌కి భారీ టార్గెట్ నిర్దేశించొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. మెండిస్ ఔటయ్యాక ఆ అంచనాలు బోల్తా కొట్టేశాయి.
Etela Rajender: ప్రజలను మోసం చేయడంలో.. కేసీఆర్ నంబర్ వన్
ఎందుకంటే.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లవ్వరూ పెద్దగా రాణించలేదు. క్రీజులో కాసేపు కూడా కుదురుకోలేకపోయారు. దునిత్ (32) ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన దసున షణక సైతం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా ఆటగాళ్లందరూ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టడంతో.. శ్రీలంక 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా పెద్దగా సత్తా చాటలేకపోయారు. భారత్ ముందున్నది స్వల్ప లక్ష్యమే కాబట్టి, ఈ మ్యాచ్ సునాయాసంగా గెలిచి, భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తే చాలు, మ్యాచ్ సహా సిరీస్ కూడా భారత్‌దే!
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్ట్ పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.. బీజేపీ మద్దతు..