NTV Telugu Site icon

SA T20 League: నేటి నుంచి సఫారీ లీగ్.. ఐపీఎల్ తరహాలో ఆదరణ ఉండేనా?

Sa T20 League

Sa T20 League

T20 League: టీ20 క్రికెట్‌లో మరో లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అభిమానులను టీ20 లీగ్‌లు అలరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్, ఇండియాలో ఐపీఎల్, పాకిస్థాన్ పీసీఎల్ వంటివి ఎంతో ఆదరణ పొందాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ ప్రారంభం అవుతోంది. నేటి నుంచి ఎస్ఏ20 పేరుతో లీగ్‌కు తెరలేవనుంది. సంక్షోభంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఈ లీగ్ కొత్త ఊపిరి పోస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఎస్ఏ20 లీగ్‌లో సత్తా చాటనున్నారు.

Read Also: Balakrishna: బాలయ్య వాచీ చూశారా? దాన్ని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా?

సఫారీ టీ20 లీగ్‌లో దాదాపు ఐపీఎల్ ఫ్రాంచైజీలే జట్లను కొనుగోలు చేశాయి. ఈ మేరకు ఐపీఎల్ మాదిరే పేర్లు కూడా ఉన్నాయి. డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎంఐ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తొలి సీజన్ బరిలో దిగుతున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ ముగిసే నాటికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు వచ్చే నెల 11న జరిగే ఫైనల్లో తలపడతాయి. అయితే ఐపీఎల్ తరహాలో ఎస్ఏ 20 లీగ్‌కు ఆదరణ దక్కుతుందో లేదో వేచి చూడాలి.