South Africa: దురదృష్టం అంటే ఇదే.. ఖాయం అనుకున్న సెమీస్ బెర్త్ చేజారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa: క్రికెట్లో దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా మాత్రమే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ముందు సెమీస్ చేరుతుందని భావించిన జట్టు దక్షిణాఫ్రికా. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. బంగ్లాదేశ్‌పై భారీ విజయం, టీమిండియా అద్భుత గెలుపు చూసి దక్షిణాఫ్రికా సెమీస్‌కు వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టోర్నీ ప్రారంభం, టోర్నీ ముగింపు ఆ జట్టు దురదృష్టాన్ని మరోసారి చాటిచెప్పాయి. సూపర్-12లో దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు గెలవాల్సింది. 7 ఓవర్లలో 64 పరుగులు చేస్తే గెలుపు ఆ జట్టు సొంతం అవుతుంది. కానీ మూడు ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. కానీ వర్షం కారణంగా అనూహ్య స్థితిలో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో జింబాబ్వే, దక్షిణాఫ్రికా చెరో పాయింట్ పంచుకున్నాయి.
Read Also: IND Vs ZIM: రాహుల్ క్లాస్.. సూర్యకుమార్ మాస్.. టీమిండియా భారీ స్కోరు
Also Read
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ఆ ఫలితం తర్వాత రెండు అద్భుత విజయాలతో సెమీస్ రేసులోకి దూసుకువెళ్లిన దక్షిణాఫ్రికా ఉన్నట్టుండి వరుసగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోయింది. దీంతో జింబాబ్వే మ్యాచ్ ఫలితం కారణంగా టోర్నీ నుంచి దక్షిణాఫ్రికా బయటకు వెళ్లిపోయింది. దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో దాని స్థానంలో అనుకోని విధంగా పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరింది. నెదర్లాండ్స్ చేతిలో దారుణంగా ఓడిపోవడం వల్ల సెమీస్ చేరే అవకాశాలను బంగారు పళ్లెంలో పెట్టి పాకిస్తాన్‌కు అప్పగించింది. ముఖ్యంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. తనకంటే ఎంతో బలమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు చూపించిన తెగువ, దూకుడు ముందు దక్షిణాఫ్రికా వెలవెలబోయింది.
తాజావార్తలు
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!