IND Vs SA 1st T20:తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. ఒక దశలో సఫారీల జట్టు 9 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు 10 ఓవర్లలోపే ఆలౌట్ అవుతుందని అనిపించింది. కానీ లోయర్ ఆర్డర్ పట్టుదలగా ఆడటంతో ఆ జట్టు పూర్తి ఓవర్లను ఆడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన భారత్.. గ్రీన్ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్‌లోనే దీపక్ చాహర్ వికెట్ల పతనానికి నాంది పలికాడు. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు బుట్టలో వేసుకున్నాడు. అయితే అతి తక్కువ బంతుల్లో తొలి 5 వికెట్లు కోల్పోయిన జట్టుగా దక్షిణాఫ్రికా జట్టు చెత్త రికార్డును నెలకొల్పింది.
Read Also:Mahendra Singh Dhoni: విజయవాడలో ధోనీ విగ్రహం.. ఖుషీ అవుతున్న అభిమానులు
అయితే ఆల్‌రౌండర్లు మార్‌క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహరాజ్ (41) పోరాడటంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 106 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 107 పరుగుల టార్గెట్ నిలిచింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు 3 వికెట్లు పడ్డాయి. అటు దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
